భగవద్గీత
మొదటి అధ్యాయం
అర్జున విషాదయోగము
భగవద్గీత నందు మొత్తం 18 అధ్యాయాలు కలవు. అందులో మొదటి అధ్యాయం పేరు అర్జున విషాద యోగము.
ఈ అర్జున విషాద యోగము నందు మొత్తము 47 శ్లోకాలు కలవు, ఈ శ్లోకాలలో
1వ శ్లోకం నుంచి 11వ శ్లోకము వరకు ప్రధాన వీరుల వర్ణన
2వ శ్లోకం నుంచి 19వ శ్లోకం వరకు ఉభయ పక్ష వీరుని శంఖా నాద వర్ణన
20వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు ఉభయ సేనలను అర్జునుడు పరిశీలంచుట
28వ శ్లోకం నుంచి 47వ శ్లోకం వరకు మోహ గ్రస్తుడైన అర్జునిడి విషాదం గురించి వివరణ ఉంటుంది.
ధృతరాష్ట్రుని ప్రశ్న
భగవద్గీత ధృతరాష్ట్రుడి ప్రశ్నతో ప్రారంభమవుతుంది. యుద్ధం గురించి వివరించమని ధృతరాష్ట్రుడు సంజయుడిని కోరే శ్లోకంతో ప్రారంభమవుతుంది.
భగవద్గీత మొత్తం సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పినట్టు ఉంటుంది.
మహా భారత యుద్ధము మొదలై పదిరోజులు జరిగింది. భీష్మ పితామహుడు రణ రంగమున కుప్పకూలుతాడు. ఈ విషయం వెంటనే సంజయుడు దృతరాష్ట్రునికి తెలపగా, దృతరాష్ట్రుడు చాలా బాధపడి 'ధర్మ క్షేత్రమైన కురుక్షేత్రమునందు (కురుక్షేత్రము అంబాలాకు దక్షిణమున, ఢిల్లీ నగరమునకు నేడు కూడా ఈ ప్రదేశము ఉన్నది. దీనికి శమంతపంచకమని కూడా పేరు గలదు) యుద్ధము చేయుటకు చేరిన నావారు మరియు పాండు కుమారులు ఏమి చేసిరి' అని సంజయుని దృతరాష్ట్రుడు అడగటంతో సంజయుడు దృతరాష్ట్రునికి ఈ విధముగా వివరించెను.
అప్పుడు సంజయుడు, ఇరు పక్షములు యుద్ధ అన్నద్దులైనప్పటి మొదలు రణ క్షేత్రములో శ్రీ కృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానోపదేశం చేసిన విషయాలు అన్నింటినీ దృతరాష్టునికి వివరంగా వివరించెను. దీనినే భగవద్గీత అంటాము.
వీరుల వర్ణన
రారాజైన దుర్యోధనుడు యుద్ధరంగమున వ్యూహరచనలో మోహరించి ఉన్న పాండవుల సైన్యాన్ని చూసి ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి 'ఓ ఆచార్య బుద్దిమంతుడు, ద్రుపద పుత్రుడైన మీ శిష్యుడు దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకంగా నిలబడి ఉన్న పాండవుల యొక్క మహా సైన్యమును చూడండి. అందులో గొప్ప ధనుర్ధారులైన భీమునికి, అర్జునికి సమానులైన గొప్పవారైనా సాత్యకి, విరాటరాజు, మహారథి అయిన ద్రుపతుడు, ధృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, ఉత్తమౌజుడు ద్రౌపది యొక్క ఐదుగురు పుత్రులు, సుభద్రాదుపుత్రుడైన అభిమన్యుడు మొదలగువారున్నారు.
'మన పక్షమున భీష్ముడు, కర్ణుడు, యుద్ధరంగమున విజయుడగు కృపాచార్యుడు, అశ్వద్దాము, వికర్ణుడు, సోమదత్తుని కుమారుడైన భూరిశ్రుడు మొదలగువారు ముఖ్యులు ఉన్నారు. అంతేకాక నా కొరకు ప్రాణాలు సైతం విడిచిపెట్టడానికి సిద్ధంగా చాలా మంది శూరులు, వీరులు మన సైన్యమునందు ఉన్నారు. వీరందరూ యుద్ధ నిపుణులు మరియు వైవిధ్యమైన శాస్త్రాలు మరియు ఆయుధాలు కలిగినవారు' అని తెలుపుతూ భీష్మ పితామహునిచే సురక్షులమైన మన సైన్యం అపరితమని, భీముని చే రక్షించబడుతున్న పాండవసైన్యం పరిమితమని వివరించెను. మరియు అన్నివైపులా నుంచి మీ మీ స్థానములలో సురక్షితంగా నిలిచి బీష్ముని రక్షించాలని తెలపడమైనది.
శంఖా నాద వర్ణన
రారాజైన దుర్యోధనుని మాటలు విన్న కురువృద్దుడు భీష్మ పితామహుడు తన శంఖమును పూరించెను. వెనువెంటనే శంఖములు, తప్పెటలు, నగారాలు, మృదంగాలు, గోముఖవాద్యములు మొదలైనవి ఒక్కసారిగా మ్రోగినవి.
తరువాత దివ్యమైన రధమును ఉన్న శ్రీకృష్ణ పరమాత్మ తన పాంచజన్యము అనే శంఖమును గట్టిగా పూరించెను. వెనువెంటనే అర్జునుడు దేవదత్తమనే శంఖమును, భీముడు పౌడ్రమానే మహా శంఖమును, ధర్మ రాజు అనంత విజయమును, నకులుడు సుకోశమును, సహదేముడు మనిపుష్పకము అనే శంఖములను, పూరించెను. మిగిలిన వీరులు వారి శంఖములు పూరించెను. ఆ భయంకర శబ్దములకు అన్నిదిక్కులు పిక్కటిల్లెను. భయంకర శబ్దాలతో ఆకాశమంతటా ప్రతిధ్వనించింది.
ఉభయ సేనలను అర్జునుడు పరిశీలంచుట
ఇరువైపులా సేనలు శంఖాలు పూరించిన తరువాత యుద్ధమునకు నడుము బిగించి సిద్దమైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా అనెను.
ఓ అచ్యుత నేను ఎవరితో యుద్ధము చేయవలెనో, రణరంగమున నందు యుద్ధము చేయుటకు నిలిచియున్న నేను ఎక్కడ నుంచి బాగా చూడగలనో అక్కడకు రధమును పోనివ్వమని కోరగా, శ్రీ కృష్ణ పరమాత్మ వారి చాలా విశాలమైన, తేజోవంతమైన, దృఢమైన, దివ్య రధమునకు నాలుగు తెల్లటి గుఱ్ఱములు పొందుపరచినవి. రథముపై హనుమంతుడు ఉన్నాడు. అంతటి రథము కృష్ణ పరమాత్మ రెండు సేనల మధ్యలో భీష్మ ద్రోణాచార్యులకు మరియు ఇతర రాజులందరి ఎదురుగా నిలిపి, అర్జునుడితో 'ఇక్కడ సమావేశమైన కౌరవ వీరులందరిని చూడమని' కృష్ణ పరమాత్మ చెప్పెను.
అప్పుడు అర్జునుడు రెండు సేనల యందు చేరియున్న తన పెద్ద తండ్రులను, పిన్న తండ్రులను, తాత ముత్తాతలను. గురువులను, సోదరులను, మేనమామలను, పుత్రులను, మిత్రులను, మొదలగు ఆత్మీయలను చూసేను.
అర్జునిడి విషాద
బంధు మిత్రులందరినీ చూసి అర్జునిడికి బందు ప్రీతితో తన హృదయము చలించి, అవయములు పట్టు తప్పి, నోరు ఎండిపోయి శరీరము నందు వణుకు గగుర్పాటు కలిగి తన చేతిలోని గాండీవము జారిపోవుచున్నది. మనసు భ్రమించి నిలబడుటకు కూడా శక్తిలేకుండా పోయినది. అర్జునుడికి అనేక అపచకుములు కనపడుచున్నవి. యుద్దములో బందు మిత్రులను చంపుటవలన కలిగే ఏమి ఏమిటనిపించింది. సొంత వారిని చంపుట శ్రేయస్సు కాదని అనిపించింది. ఈ రాజ్యముగాని, సుఖము గాని బందు మిత్రులు పోయిన తరువాత ఎందుకని బాధపడ్డాడు. అంతే కాక ఈ యుద్ధము వలన అందరూ చనిపోతే పితృలకు ఎవరు తర్పములు వదులుతారు. స్త్రీలు ఏమైపోవాలి. తనను ఎవరు చంపినను వారిని చంపాను' అని అర్జుడుడి శ్రీ కృష్ణ పరమాత్మతో పలికి చలించిన మనసు కలవాడై ధనస్సు బాణాలను త్వదించి, రధము వెనుక చతికిల పడెను.
అని దృతరాశునికి సంజయుడు ఈ అధ్యాయము నందు వివరించెను
0 కామెంట్‌లు