Header Ads Widget

Bhagavad Gita Quotation

41 రోజులు భగవద్గీత ప్రచారం & గీతా మహోత్సవం - శ్రీ రామ సేవా సమితి


భారతీయ సంస్కృతిలో అత్యున్నతమైన ధార్మిక గ్రంథాలలో భగవద్గీతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ గ్రంథం జీవనాన్ని ఎలా జీవించాలో చెప్పే మహత్తరమైన మార్గదర్శక శాస్త్రం. ఈ భావనను సమాజానికి తెలియజేయాలన్న సంకల్పంతో శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో గీతా ప్రచారం కార్యక్రమాన్ని ప్రారంభించదలిచారు.
లక్ష్యం వారానికి నాలుగు రోజులు చొప్పున 41 రోజులు పాటు “ భగవద్గీత ఎందుకు చదవాలి? ” అనే అంశంపై ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించడం.
భగవద్గీత ప్రచారం మహా పుణ్యము
- మీరు పాల్గొనే అవకాశం వచ్చింది.
సంప్రదించండి : తుంగా శ్రీ +91 6301767565
ఈ ప్రచార కార్యక్రమము 25 జులై 2025 వ తేదీ నుంచి ప్రచారం ప్రధానంగా కుత్భుల్లాపూర్ మండలంలో ప్రారంభ అవుతుంది. మరియు మదీనా గూడా, నిజామాబాద్, లంగర్ హౌస్, అత్తాపూర్, బాచుపల్లి, యూసూఫ్ గూడ, అమీర్ పేట ప్రాంతాలలోని ఒకటి రెండు బస్తీల్లో ప్రచారం ఉంటుంది. ఈ ప్రచార కార్యక్రమములో పాల్గొనుటకు సంప్రదించండి.
ఫోన్ నెంబర్ : +91 6301767565

ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం, మన భారతీయ సంప్రదాయాన్ని, నైతిక విలువలను, ధర్మ మార్గము గురించి పరిచయం లేని వారికి పరిచయం చేయడం ప్రధాన ఉద్దేశ్యం. ఆధునిక జీవన శైలి, పాశ్చాత్య ప్రభావం వల్ల మన యువత నైతిక విలువల నుండి కొంతదూరంగా వెళ్తున్న ఈ సమయంలో, భగవద్గీత మార్గదర్శనంగా నిలిచే దివ్యమైన గ్రంథం గురించి ప్రజలకు వివరించాలనే సంకల్పమే ఈ ప్రచారము.

భగవద్గీతను చదవడం వల్ల మనస్సు స్థిరపడుతుంది, జీవితంలో సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి కలుగుతుంది. “కర్మ చేయాలి కాని ఫలంపై ఆశపడకూడదు”, “ధర్మమునుబట్టి జీవించాలి” వంటి ఉపదేశాలు ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగిస్తాయి. ఈ విషయాలను స్పష్టంగా తెలియజేయటమే ఈ ప్ప్రచారం యొక్క లక్ష్యం.

శ్రీ రామ సేవా సమితి సభ్యులు, తమ సమయాన్ని అంకితంగా ఇవ్వడమే కాక, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ, వారికి భగవద్గీత సారాన్ని సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తూ... ఇంటింటికీ వెళ్లడం ద్వారా, ప్రతి కుటుంబ సభ్యుడిలో ఒకరిద్దరైనా ఆలోచనలో పడతారు, ప్రశ్నలు వేస్తారు, తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా ఒక సామూహిక ఆధ్యాత్మిక చైతన్యం ఏర్పడుతుంది.

ఈ ప్రచారం వలన భగవద్గీతను చదవాలనే సంకల్పం ఒక్క వ్యక్తిని మారుస్తుంది, కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది, సమాజాన్ని మారుస్తుంది.

ఈ విధమైన కార్యక్రమాలు మానవులలో మంచి మార్పులకు నాంది పలుకుతాయి. శ్రీ రామ సేవా సమితి తీసుకున్న ఈ ధర్మ కార్యం వారానికి నాలుగు రోజులు చొప్పున 41 రోజుల ప్రచారం సాగాలనే సంకల్పము ఎందుకంటే భగవద్గీత మన శాశ్వత ధర్మాన్ని నేర్పే గ్రంథం. దాన్ని ప్రతి ఇంటిలో ప్రతిధ్వనింపజేయడం సనాతన ధర్మానికి చేస్తున్న గొప్ప సేవ.


గీతా జయంతి మహోత్సవం వివరాలు

ప్రచార అనంతరం 30 నవంబర్ 2025 ఆదివారము తేదీన 1008 తేదీన 1008 మంది పైన భక్తులుతో గీతా జయంతి మహోత్సవ కార్యక్రమము ఉంటుంది.
ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులు

కార్యక్రమము : గీతా జయంతి మహోత్సవం
తేదీ : 30 నవంబర్ 2025 ఆదివారం
సమయం : ఉదయం 8.30 నిమిషాల నుంచి
స్థలం : TSIIC కాలనీ, షాపూర్ నగర్
గీతా జయంతి మహోత్సవమును దిగ్విజయం చేయుటకు ముందుకొచ్చిన వారికి ధన్యవాదములు
  • రాజగోపాల్ రెడ్డి గారు
                  - భగవద్గీత సత్సంగ్
  • వెంకటరమణ గారు
                  - భగవద్గీత సత్సంగ్ - మేడ్చల్
  • శ్రీ ధర్మ శాస్త సేవా సమితి సభ్యులు
                  - భగత్ సింగ్ నగర్, చింతల్
  • -

భక్తులు విరాళం అందించవచ్చు.
సంప్రదించండి : 6301767565

కృష్ణం వందే జగద్గురుమ్

ఇట్లు
శ్రీ రామ సేవా సమితి
+91 6301767565

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు