
ఒకసారి ఒక సాధువు దగ్గరకు.
ఒక యువకుడు వచ్చి, విసుగుతో చెప్పాడు:
"గురువర్యా, మన సనాతన ధర్మం క్రమంగా మాయమవుతోంది.
నేను ఈ మహా సముద్రాన్ని ఎలా కదిలించగలను?"
సాధువు మెల్లిగా ఒక చిన్న పాత్ర నీరు తీసుకొని, గడ్డికూడా లేని దగ్గర పొయ్యమన్నాడు, ఇలా రోజు పోయడంతో కొన్ని రోజుల తరువాత అక్కడ చిన్న మొలకల వలన పచ్చదనంతో నిండిపోయింది.
అప్పుడు ఆ సాధువు చెప్పారు:
"చూడు నాయనా … చిన్న ప్రయత్నం అయినా పెద్ద మార్పును తీసుకొస్తుంది.
నీ శక్తి కొద్దీ ప్రయత్నం చేసి చూడు,
అది మరొకరిని ప్రేరేపిస్తుంది,
ఆ మరొకరు ఇంకొకరిని — ఇలా తరంగాలు విస్తరిస్తాయి."
తరువాత సాధువు ఆకాశం వైపు చూపిస్తూ చెప్పారు:
"సూర్యుడు ఉదయించేటప్పుడు చీకటి యుద్ధం చేయదు; ఆ చీకటి స్వయంగా తొలగిపోతుంది.
సత్యం, ధర్మం కూడా అలాగే.
నీలోని జ్ఞానమనే దీపాన్ని వెలిగించు — అది మరెవరిదో హృదయంలోని వెలిగిస్తుంది."
ఆ యువకుడు లోలోపల ఒక జ్వాలను అనుభవించాడు.
ఆ రోజు నుండి అతను చిన్న చిన్న కార్యాల ద్వారా ధర్మం కోసం కృషి చేయసాగాడు —చిన్న ప్రయత్నం పెద్ద మార్పును తీసుకొచ్చి.
కాలక్రమంలో, చుట్టూ ఉన్న సమాజం మెల్లగా మారిపోవడం మొదలైంది.
సందేశం :
సనాతన ధర్మాన్ని మేల్కొలపడానికి మొత్తం ప్రపంచాన్ని ఒక్కసారిగా మార్చాల్సిన అవసరం లేదు.
నీ హృదయంలో దీపాన్ని వెలిగించు — అది ఇతరుల హృదయాలలో అగ్ని రగిలిస్తుంది.
0 కామెంట్‌లు