
ఒక గ్రామంలో ఒక వృద్ధ సన్యాసి ఉండేవాడు. ఆయన జీవితం సాదాసీదాగా కనిపిస్తుంది, కానీ జ్ఞానంతో నిండిపోయి ఉండేది. ఒక రోజు ఒక యువకుడు ఆయన వద్దకు వచ్చి అడిగాడు – "స్వామీ! ఈ లోకం చాలా చీకటిగా, కష్టాలతో నిండిపోయి ఉంది. నేను మార్చాలి అనుకుంటున్నాను, ఎలా మార్పు తేవగలను? దయచేసి తెలపగలరు" అని అడిగాడు.
సన్యాసి చిరునవ్వుతో ఒక చిన్న నూనె దీపం వెలిగించి, "ఈ దీపాన్ని తీసుకుని, రాత్రంతా దీని కాంతి ద్వారా చీకటిని పారద్రోలూ." అంటూ యువకుడి చేతిలో పెట్టి చెప్పాడు.
యువకుడు ఉదయాన్నే తిరిగి వచ్చి చెప్పాడు – "స్వామీ! నేను మొత్తం చీకటిని తొలగించలేకపోయాను. ఎందుకంటే దీపం ఉన్న చోట మాత్రం చీకటి లేదు."
అప్పుడు సన్యాసి అన్నాడు – "అదే జీవితం యొక్క సత్యం. నువ్వు మొత్తం లోకాన్ని మార్చలేకపోవచ్చు. కానీ నీ చుట్టూ ఉన్న చోట వెలుగుని పంచితే, చీకటి తగ్గిపోతుంది. నీ మార్పు ద్వారా ఇతరులు ప్రేరణ పొందుతారు. చివరికి, లోకం కొంచెం కొంచెంగా వెలుగుతో నిండిపోతుంది."
బోధ:
మనం ఒకేసారి ప్రపంచాన్ని మార్చలేకపోతున్నాం అని భాద పడకుండా , మన చుట్టూ ఉన్న చీకటిని తొలిగిస్తూ మరొక్క దీపాన్ని వెలిగించడము వలన, అది క్రమంగా సమస్త లోకాన్నే మార్చగలదు.
చిన్న ప్రయత్నమే పెద్ద మార్పును తీసుకొస్తుంది
0 కామెంట్‌లు