-
పలకండి పలకండి రామ నామము
పలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామము ||2||అందరాని ఫలమండి రామనామము
అందుకుంటే మోక్షమండి రామ నామముపలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామముగౌరీ శకరులెప్పుడు రామనామము
నిరతముగను దలచుచుండు రామ నామముపలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామముజాతి భేదమేమి లేదు రామనామము
అందరము పలకవచ్చు రామనామముపలకండి పలకండి రామ నామము
మీరు పలకమంటే పలకరేమి రామ నామము ||2|| -
రామ రామ రామ్ రామ్ రామ్
రామ రామ రామ్ రామ్ రామ్
జయ రామ రామ రామ్ రామ్ || 4 ||దశరథ నందన రామ్ రామ్ రామ్
దశముఖ మర్దన రామ్ రామ్ రామ్ || 2 ||పశుపతి రంజన రామ్ రామ్ రామ్
పాప విమోచన రామ్ రామ్ రామ్ || 2 ||రామ రామ రామ్ రామ్ రామ్
జయ రామ రామ రామ్ రామ్ || 2 ||అనాధ రక్షక రామ్ రామ్ రామ్
ఆపద్భాందవు రామ్ రామ్ రామ్ || 2 ||మైతిలి నందన రామ్ రామ్ రామ్
మారుతి వందిత రామ్ రామ్ రామ్ || 2 ||రామ రామ రామ్ రామ్ రామ్
జయ రామ రామ రామ్ రామ్ || 4 ||జయ రామ రామ రామ్ రామ్ || 4 ||
-
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2|అభినందనలందుకొన్న కోతి మూక ధన్యము
ఆశీస్సులు పొందిన ఆ పక్షి రాజు ధన్యము |2|రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యమురేగిపండు తినిపించిన శబరి మాత ధన్యము
నావ నడిపి దరిజేర్చిన గుహుని సేవ ధన్యము |2|రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యముపాద ధూళి సోకిన శిల ఎంతో ధన్యము
వారధని నిలిపిన సాగర జలమెంతో ధన్యము |2|రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యముమధురాతి మధురము రెండక్షరాల మంత్రము
సత్యధర్మ శాంతియే రాముని అవతారము |2|రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యమురామ కార్యము చేబట్టిన భక్తులెంతో ధన్యము
రామ నామము స్మరిస్తున్న మనమెంతో ధన్యము |2|రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము
రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము |2| -
పాడితే శ్రీ రాముని పాట పాడాలి
పాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలి || 2 ||పూలతో శ్రీ రాముని పూజ చేయాలి
ప్రతి నిత్యము శ్రీ రాముని సేవ చేయాలిపాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలిచరణం 1 :-
మల్లెలు మొల్లలు కోసుకొద్దాము
సన్నజాజి పువ్వులు తీసుకొద్దాము
పున్నాగ పువ్వులు ఏరుకొద్దాము
మందార పూలతో మాల కడదాముపాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలిచరణం 2 :-
రారండి శ్రీ రాముని చూచివద్దాము
శ్రీ రాముని మెడలోన మాలవేద్దాము
మనసారా శ్రీరాముని మ్రొక్కివడ్డాము
శ్రీ రాముని ఆశీస్సులు పొంది వద్దాముపాడితే శ్రీ రాముని పాట పాడాలి
భక్తితో శ్రీ రాముని భజన చేయాలి
పూలతో శ్రీ రాముని పూజ చేయాలి
ప్రతి రోజు శ్రీ రాముని సేవ చేయాలి || 2 || -
శ్రీరామంటే చింతే లేదు
శ్రీరామంటే చింతే లేదు
జయరామంటే జన్మం లేదు || 2 ||నారాయణ అంటే నరకం లేదు
మాధవ అంటే మారుపే లేదుశ్రీరామంటే చింతే లేదు
జయరామంటే జన్మం లేదుఅచ్యుత అంటే ఆపద లేదు
గోవిందా అంటే కొదవే లేదుశ్రీరామంటే చింతే లేదు
జయరామంటే జన్మం లేదుకృష్ణ అంటే కషటం లేదు
బాధలు లేవు, భయములు లేదుశ్రీరామంటే చింతే లేదు
జయరామంటే జన్మం లేదునోములు, వృత్తములు నూరైనాను
యజ్ణయోపవేతం వెయ్యయినానురామనామముకు సరిరావంట
రామనామముకు సరిరావంటశ్రీరామంటే చింతే లేదు
జయరామంటే జన్మం లేదుశ్రీరామ చంద్ర లోకైక వీర
ఆపద్భాందవు అనాదరక్షకశ్రీరామచంద్ర దుష్ట సంహార
శ్రీరామచంద్ర శిష్ట రక్షకశ్రీరామంటే చింతే లేదు
జయరామంటే జన్మం లేదు || 2 ||నారాయణ అంటే నరకం లేదు
మాధవ అంటే మారుపే లేదు || 2 || -
ఓ రామ నీ నామము ఎంత మధురమో
ఓ రామ నీ నామము ఎంత మధురమో
ఎంత మధురమో దేవా ఏమి మధురమో || 2 ||చరణము :- 1
ఎనలేని నీ నామము ఎన్ని సార్లు పలికినా
అలుపురాని నామము పలికినా చాలును
పాపాలను బాపేతి పరమ పుణ్య నామము
మరువలేమయా దేవా మరపురాదాయాఓ రామ నీ నామము ఎంత మధురమో || 2 ||
చరణం : 2
కౌశిక యాగమును కాచినట్టి నామము
వరమున వలిడగా మార్చిన నామము
రావణాది రాక్షసుల హత మార్చిన నామము
మరువలేమయా దేవా మరపురాదాయాఓ రామ నీ నామము ఎంత మధురమో || 2 ||
చరణం : 3
భక్తి ముక్తి దాయకం సర్వలోక నామము
పదునాలుగు లోకాలు పాలించే నామము
ఆపదలను బాపేతి అభయమిచ్చు నామము
మరువలేమయా దేవా మరపురాదాయాఓ రామ నీ నామము ఎంత మధురమో ఎంత మధురమో దేవా ఏమి మధురమో || 2 ||
-
రామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
రామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి || 2 ||చరణం : 2
మా పూజలెడేరే మా జన్మ కడతేరే
మా రాజా నీ సేవ దొరికేనయ్యా
మా మీద దయ పెట్టి చూడాలయ్యరామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రిచరణం : 3
అయ్య మాట కాదనకా అమ్మ కైకనేమనక
అడవులకు దారిపట్టి వెళ్లావయ్యా
ఆది నారాయణుడవు నీవేనయ్యారామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రిచరణం : 4
ఏ ప్రొద్దూ నిన్ను తలచీ నీ పాదాలనే కొలచి
చెవులారా నీ కథలు వింటామయ్య
నీ మహిమలే చాటుకుంటామయ్యరామయ్య తండ్రి రఘు రామయ్య తండ్రి
ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి
నీవు ఎంత గొప్ప వాడివయ్యా రామయ్య తండ్రి || 2 || -
జయ రఘునందన జయ జయ రామ
జయ రఘునందన జయ జయ రామ
జయ జయ జననీ జానకిరామ
నవ నవ కోమల మేఘశ్యామ
భవహరణ భద్రాచల రామ
దశరథ నందన హే పరంధామ
దశముఖ మర్థన శ్రీ రఘురామ
రామ రామ రామ రామ
రామ రామ రామ రామ
రామరామ రామరామ రామరామ రామరాం
రామ రామ రామ రామ
రామ రామ రామ రామ -
జయ జయ శ్రీరామా
జయ జయ శ్రీరామా
జయ జయ రఘురామాఅనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామకలియుగ వరదారాం
కల్మషాహారణారాంఅనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామజయ జయ శ్రీరామా
జయ జయ రఘురామాఅనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామఅయోధ్యవాసా రాం
దశరధ తనయారాంఅనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామజయ జయ శ్రీరామా
జయ జయ రఘురామాఅనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామకరుణ్యమూర్తిరాం
కరుణాసాగరరాంఅనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామజయ జయ శ్రీరామా
జయ జయ రఘురామాఅనాధనాధ దీనబంధూ
జయ జయ శ్రీ రామ -
ఎంత మధురమో రామనామము
ఎంత మధురమో రామనామము
ఎంతెంత మధురమో రామనామము
రామ రామ సీతచరణం 1 :
పాలు తేనెలకన్న పంచదారాలకన్న
తీయగుంటాది రామనామము
తీయతీయగుంటది రామనామమురామ రామ సీత
ఎంత మధురమో రామ నామము
ఎంతెంత మధురమో రామ నామముచరణం 2 :
పండు వెన్నెలకన్న
నిండు జాబిలికన్న
చల్లగుంటదీ రామ నామము
చల్లచల్లగుంటది రామ నామమురామ రామ సీత
ఎంత మధురమో రామ నామము
ఎంతెంత మధురమో రామ నామముచరణం 3 :
చిలక పలుకులుకన్న
కోయిలరాగాలకన్న
హాయిగుంటాది రామనామము
హాయి హాయిగుంటది రామ నామమురామ రామ సీత
ఎంత మధురమో రామ నామము
ఎంతెంత మధురమో రామనామము
మదురాతి మదురము రామనామము
రామ రామ సీత || 2 || -
రామ రఘు రామా
రామ రఘు రామా
నీ నామమే మధురమయా || 2 ||
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయాదశకంఠుని వధియించుటకై
దశరథ తనయుడవైతివా
దైత్యులను వధియించి
లోకాన్నే కాచితివారామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయాగురువు యాగము గాచుటకై
రక్షణకై వెళ్ళితివా
తాటకిని వధియించి
చక్కగ జనులను బ్రోచితివారామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయాశివుని విల్లుని త్రుంచితివి
సీతను చేపట్టితివి
ఒకటే మాట ఒకటే భాణం
ఒకటే సతియని తెలిపితివారామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయాతల్లి మాటను మీరకనే
కారడవులకు వెళ్ళితివా
అడవులలో నివసించి
సత్యాత్ముడవై వెలిగితివారామ రఘు రామా
నీ నామమే మధురమయా
భక్తుల బ్రోవుమయా
దాసులా గావుమయా -
ఆశీర్వదించు రామా
ఆశీర్వదించు రామా
మమ్ము ఆశీర్వదించు రామా || 2 ||నీ పాద పద్మాలపై
భక్తితో ప్రణమిల్లినామా రామా || 2 ||అభయప్రదాత రామా
మా తండ్రి ఐశ్వర్య దాతా రామాఆరోగ్య దాత రామా
మా తండ్రి ఆనంద దాత రామాఅసమాన రూప రామా
మా తండ్రి రవితేజ రూప రామాసౌదర్యం మూర్తి రామా
మా తండ్రి సద్గుణా మూర్తి రామాఅయోధ్య వాసా రామా
మా తండ్రి అసమాన మూర్తి రామాకరుణ కటాక్ష రామా
మా తండ్రి భక్త సంరక్ష రామాకృష్ణావతార రామా
మా తండ్రి అవతారపురుష రామాఓ పుండరీక్ష రామా
మా తండ్రి మమ్ము కాపాడు రామా -
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
భారత మాతాకీ - జై
పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలిచరణం 1
గలగల పాడే ఓ సెలఏరా...
కిలకిలా లాడే పక్షుల్లారా...
రాముణ్ణి చూసారా...
మా దేవుణ్ణి చూసారా || 2||పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలిచరణం 2
నిగనిగ లాడే హంసల్లారా
కలకల లాడే వృక్షముల్లారా
రాముణ్ణి చూసారా
మా దేవుణ్ణి చూసారా
ఎక్కడ ఉన్నాడా
మీ ఇంటనే డాగాడా || 2||పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలిచరణం 3
కొండల్లారా కోనల్లారా
రివున్న ఎగసే గువ్వల్లారా
రాముణ్ణి చూసారా
మా దేవుణ్ణి చూసారా
అక్కడ ఉన్నాడా
మీ ఇంటనే దాగాడా || 2||పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలిచరణం 4
తళ తళ మెరిసే తారకల్లారా
వెన్నెల కురిసే ఓ చందమామా
రామున్ని చూసారా
మా దేవుణ్ణి చూసారా
అక్కడ ఉన్నాడా
మీ ఇంటనే దాగాడా || 2||పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలిచరణం 5
చల్లగా వీచే ఓ చిరుగాలి
మెల్లగా సాగే ఓ మేఘమాల
రామున్ని చూసారా
మా దేవుణ్ణి చూసారా
అక్కడ ఉన్నాడా
మీ ఇంటనే దాగాడా || 2||పల్లవి:-
దాగుడు మూతలు ఊలలాటలో దాగినాడు
నా రాముడు, ఎక్కడ దాగాడే
నా కంటికి కనపడడే
అతనిని చూడాలి
మనము ఆటల్లో గెలవాలి.శ్రీ సీతారామ మూర్తికి - జై
-
సిరినవ్వుల సీతమ్మ
భారత మాతాకీ - జై
సిరినవ్వుల సీతమ్మ
శ్రీరాముడు ఏడమ్మాహరేరామ హరేరామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేభక్తులందరూ కూడా
నీకు భజనలు చేసాము
భజనలు చేసాము కాపాడగా రావయ్యాహరేరామ హరేరామ
రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేసిరినవ్వుల సీతమ్మ
శ్రీరాముడు ఏడమ్మామల్లె మందారం మాలలు అల్లాము
మాలలు అల్లాము నీ మేడలో వేసాము
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేసిరినవ్వుల సీతమ్మ
శ్రీరాముడు ఏడమ్మాభద్రాచలంలో వెలసిన శ్రీరామా
దయతో రావయ్యా కాపాడగ రావయ్యా
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరేశ్రీ సీతారామ మూర్తికి - జై
-
రామా యనరాదా నీకొక్కసారి
భారత మాతాకీ - జై
రామా యనరాదా
నీకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదాకోతులు ఉన్నవి ఎందుకయ్యా
కొమ్మర్లు విరిచేటందుకయ్యా || 2 ||రామా యనరాదా
నీకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదాకొమ్మలు విరిచేది ఎందుకయ్యా
వారధి కట్టేటందుకయ్యా || 2 ||రామా యనరాదా
నీకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదావారధి కట్టేది ఎందుకయ్యా
లంకను చేరేటందుకయా || 2 ||రామా యనరాదా
నీకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదాలంకను చేరేది ఎందుకయ్యా
రావణుని చంపేటందుకయ్యా || 2 ||రామా యనరాదా
నీకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదారావణుని చంప్పేది ఎందుకయ్యా
సీతను తెచ్చేటందుకయా || 2 ||రామా యనరాదా
నీకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదాసీతను తెచ్చేది ఎందుకయ్యా
అయోధ్యను ఏలేటందుకయ్యా || 2 ||రామా యనరాదా
నీకొక్కసారి రామా యనరాదా
రామా యనరాదా
మరొక్కసారి రామా యనరాదా || 2 ||శ్రీ సీతారామ మూర్తికి - జై
0 కామెంట్‌లు